ఏపీలో మ‌ళ్లీ చిన్న‌మ్మే.. తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ ఎవ‌రు?

ఏపీలో మ‌ళ్లీ చిన్న‌మ్మే.. తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ ఎవ‌రు?

Posted on: 30-06-2025

Categories: Politics | Andhra | Telangana

దేశవ్యాప్తంగా కమలం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు అధ్యక్షులు నిమిత్తం అయ్యారు. మిగిలిన రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజు అధ్యక్షులను ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధమైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి జూలై 1న‌ తేదీన అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో పార్టీ నూతన అధ్యక్షులను ప్రకటించనున్నారు.

Sponsored