తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు హరీష్ రావు.. తాజాగా ఆటోడ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో కార్మికులు చొక్కాపై చొక్కా వేసుకునే విధంగా హరీష్‌రావు కూడా.. తన తెల్లటి చొక్కాపై ఖాకీ చొక్కాను ధరించారు. కొద్ది సేపు.. ఆటోలో చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆటో కార్మికుల కష్టాల ను కళ్లారా తెలుసుకున్నానని కామెంట్ చేశారు. వారిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు.