మమతా బెనర్జీ పాలనలో నడుస్తున్న పశ్చిమ బెంగాల్ పై బోలెడన్ని విమర్శలు.. షాకింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేయటం తెలిసిందే. దీదీ రాజ్యంలో షాకింగ్ ఉదంతాలకు కొదవలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వేళ.. ఎవరూ ఊహించని ఉదంత ఒకటి వెలుగు చూసింది. ఒక ప్రభుత్వ పాఠశాలలో హిందువులు.. ముస్లిం విద్యార్థులకు వేర్వేరుగా మధ్యాహ్న భోజనాల్ని వండుతున్న వైనం వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బర్ధమాన్ జిల్లా కాల్నా సబ్ డివిజన్ పాఠశాలలో ఈ ఉదంతం ఏళ్లకు ఏళ్లుగా నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ స్కూల్లో మొత్తం 72 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 43 మంది హిందువులు.. 29 మంది ముస్లిం విద్యార్థులు.